Home గాసిప్స్ ఎన్టీఆర్-రామ్ చరణ్ 35 రోజులు అక్కడే!!

ఎన్టీఆర్-రామ్ చరణ్ 35 రోజులు అక్కడే!!

315
0

     టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ RRR. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా అప్పుడప్పుడు హీరోలకు జరిగే చిన్న గాయాల వలన షూటింగ్ డిలే అవుతున్నా కానీ ఎట్టి పరిస్థితులలో కూడా సినిమా వచ్చే ఇయర్ అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందట.

కాగా రీసెంట్ గా సినిమా యూనిట్ తమిళనాడు కి వెళ్లారట. అక్కడ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ల పై కీలక మైన సన్నివేశాల షూటింగ్ జరుగుతుందని సమాచారం. దాదాపు 35 రోజుల పాటు నాన్ స్టాప్ గా జరిగే షూటింగ్ తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని తిరిగి హైదరాబాదు లో…

రామోజీ ఫిల్మ్ సిటీ లో మరో 40 రోజుల షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఇక సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా ఆలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ హీరోయిన్స్ ని ఎంచుకుంటున్నా వారి డేట్స్ ఇబ్బంది వలన కొత్త హీరోయిన్స్ వేట కొనసాగుతూనే ఉంది.

అత్యంత భారీ బడ్జెట్ తో తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఏక కాలంలో వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీయడం ఖాయమని చెప్పొచ్చు. కాగా సినిమా షూటింగ్…

త్వరలో జరగనున్న హైదరాబాదు షెడ్యూల్ తర్వాత 40% కి పైగా పూర్తీ అవుతుందని అంటున్నారు. మరి టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఇద్దరు ఊరమాస్ హీరోల కి ఎలాంటి సెన్సేషనల్ హిట్ ఇస్తాడో అన్నది వచ్చే ఏడాది తేలనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here