యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) నటించిన లేటెస్ట్ మూవీ రంగబలి(Rangabali) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా సినిమా అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోలేక పోయింది…
ఈ సినిమా తిరిగి ఛలో సినిమా రేంజ్ లో హిట్ అందుకోవాలని ఆశించిన నాగశౌర్యకి రంగబలి ఫస్టాఫ్ వరకు సాటిస్ ఫై చేసినా సెకెండ్ ఆఫ్ వలన ట్రాక్ తప్పి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తొలిరోజు కలెక్షన్స్ పరంగా సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను మాత్రమే సొంతం చేసుకోగా రెండో రోజు వీకెండ్ అయినా కూడా సామజవరగమనా (SamajaVaragamana) హావా ముందు తలవంచక తప్పలేదు, దాంతో రంగబలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
ఇప్పుడు రెండో రోజు ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే అటూ ఇటూగా ఇప్పుడు 50 లక్షల నుండి 45 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజున 55 లక్షలకు అటూ ఇటూగా షేర్ ని ఈ రోజు అందుకునే అవకాశం ఉంది. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 2 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.