బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అవలీలగా 160 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తక్కువ కాని కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్న రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 107 కోట్ల తో సరిపెట్టగా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ మొదటి రోజు తో పోల్చితే ఏకంగా 50% కి పైగా తగ్గు ముఖం పట్టింది.
దాంతో భారీ షాకే తగిలేలా ఉంది.. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగుండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ బాగానే ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. రెండో రోజు ఈ సినిమా అనుకున్న లెవల్ లో పున్జుకుంటే…
50 కోట్ల నుండి 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. అది కూడా ఆఫ్ లైన్ లో జరిగే టికెట్ సేల్స్ ని బట్టి పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.