Home న్యూస్ 2.0 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….అనుకున్నదొక్కటి..వచ్చింది ఒక్కటి

2.0 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….అనుకున్నదొక్కటి..వచ్చింది ఒక్కటి

0

రజినీకాంత్ అక్షయ్ కుమార్ శంకర్ ల అల్టిమేట్ కాంబో లో సుమారు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో 10 వేల కి పైగా థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా అల్టిమేట్ పాజిటివ్ రివ్యూ లతో మినిమమ్ 3.5 కి తగ్గని రేటింగ్స్ తో ఓపెన్ అయిన 2.0 మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేయడం ఖాయమని ప్రతీ ఒక్కరు అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదనే చెప్పాలి.

కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద ఇండియా లో 43 కోట్ల షేర్ ని, 64 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 82 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఓవర్సీస్ మొత్తం మీద సినిమా 25 కోట్ల గ్రాస్ ని 11 కోట్లకు పైగా షేర్ ని అందుకున్నట్లు సమాచారం.

దాంతో టోటల్ గా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 54 కోట్లకి పైగా షేర్ ని అందుకోగా టోటల్ గ్రాస్ 107 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇది ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ గా చెప్పుకోవచ్చు. కానీ ట్రేడ్ 160 కోట్లకు తక్కువ కానీ కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా టోటల్ గా వచ్చింది మాత్రమె వేరని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here