బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో కెరీర్ బెస్ట్ రికార్డులతో దుమ్ము లేపిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు రెండో వారం లో అడుగు పెట్టబోతుంది, సినిమా మొదటి వారంలో ఆల్ మోస్ట్ 30 కోట్ల లోపు షేర్ ని అందుకుని సంచలన కలెక్షన్స్ తో ఫస్ట్ వీక్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇక రెండో వారంలో డియర్ కామ్రేడ్ నుండి గట్టి పోటి ఎదురు అవుతున్నా కానీ…
మాస్ సెంటర్స్ లో భారీ గా హోల్డ్ చేయడం తో థియేటర్స్ భారీగానే హోల్డ్ చేసింది, మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 670 కి పైగా థియేటర్స్ లో దుమ్ము లేపిన ఈ సినిమా రెండో వారంలో నైజాంలో 130 కి పైగా, సీడెడ్ లో 80 కి పైగా అలాగే టోటల్ ఆంద్రాలో…
150 కి పైగా థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగిస్తుంది. మొత్తం మీద రెండో వారం లో రెండు తెలుగు రాష్ట్రాలలో 360 కి పైగా థియేటర్స్ లో రన్ కానున్న ఈ సినిమా ఈ వారం చూపెట్టే జోరు ని బట్టి లాంగ్ రన్ లో 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంటుందా లేదా అన్నది క్లియర్ గా తేలనుంది.