Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ 9 వ రోజు కలెక్షన్స్…తగ్గినా మళ్ళీ కొట్టాడు!!

ఇస్మార్ట్ శంకర్ 9 వ రోజు కలెక్షన్స్…తగ్గినా మళ్ళీ కొట్టాడు!!

0

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 8 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ 30 కోట్లకు పైగా షేర్ ని అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమా డియర్ కామ్రేడ్ వలన తొలి రెండు షోలకి చాలా వరకు స్లో డౌన్ అయింది, దాంతో రోజు ముగిసే సరికి సినిమా 50 లక్షలు వసూల్ చేయడం కూడా కష్టమే అనుకున్నారు.

కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి వచ్చే సరికి సినిమా మంచి గ్రోత్ నే సాధించింది, మాస్ సెంటర్స్ లో గ్రోత్ మరీ అద్బుతం కాకున్నా మంచి గ్రోత్ నే అందుకుందని చెప్పొచ్చు. కొన్ని సెంటర్స్ లో షాకింగ్ గా కొత్త సినిమా డియర్ కామ్రేడ్ కి పోటిగా కలెక్షన్స్ ని అందుకుంది.

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల నుండి 65 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం గట్టిగా ఉంది, అంటే 8 వ రోజు తో పోల్చితే 9 వ రోజు డ్రాప్స్ 35% లోపే ఉందని చెప్పొచ్చు. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here