కోలివుడ్ మీడియం రేంజ్ హీరోల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసిన శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా ఊహకందని ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా యునానిమస్ పాజిటివ్ రివ్యూలను టాక్ ను కూడా సొంతం చేసుకోవడంతో…
అంచనాలను మించి రచ్చ చేసిన తర్వాత రెండో రోజు కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో మరోసారి మిగిలిన మూవీస్ ని డామినేట్ చేసే రేంజ్ లో బుకింగ్స్ తో జోరుని…
చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా తమిళనాడులో మొదటి రోజుకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…1.7-1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా….
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా ఓవరాల్ గా రెండో రోజు 15 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కేరళ, కర్ణాటకా మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో సైతం సినిమా…
ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతుంది…దానికి తోడూ ఓవర్సీస్ లో కూడా సినిమా హోల్డ్ బాగుండటంతో రెండో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి 25 కోట్ల మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఎంతైనా ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క మించే అవకాశం కూడా ఉంది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.