Home న్యూస్ టిల్లు స్క్వేర్ 2nd DAY కలెక్షన్స్…..మాస్ జాతర ఇది!!

టిల్లు స్క్వేర్ 2nd DAY కలెక్షన్స్…..మాస్ జాతర ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మొదటి రోజు రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు…

రెండో రోజులో ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా నైజాంలో బుకింగ్స్ ఆల్ మోస్ట్ డే 1 కి ఈక్వల్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఆంధ్ర సీడెడ్ లో కూడా మంచి జోరుని చూపెడుతుంది. ట్రాక్ చేసిన సెంటర్స్ లో…

అన్ని చోట్లా దుమ్ము లేపుతున్న సినిమా ఇప్పుడు రెండో రోజు మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. దాంతో సినిమా రెండో రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే రెండో రోజు 5 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ లెక్క ఇంకా పెరిగి 5.5-6 కోట్ల రేంజ్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 7కోట్ల రేంజ్ నుండి 7.5 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….

మొత్తం మీద రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ అంచనాలను అందుకునే అవకాశం మించి పోయే ఔట్ రైట్ ఛాన్స్ ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here