Home TRP రేటింగ్ 236CR సినిమా…1st టైం TRP దెబ్బ పడినా…2nd టైం TRP కుమ్మేసిందిగా!

236CR సినిమా…1st టైం TRP దెబ్బ పడినా…2nd టైం TRP కుమ్మేసిందిగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సంక్రాంతికి భారీ పోటిలో వచ్చిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమా సంక్రాంతికి ఊహకందని భారీ విజయాన్ని సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది… సాలిడ్ కంబ్యాక్ మూవీ గా…

నిలిచిన వాల్తేరు వీరయ్య ఓవరాల్ గా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 236 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేయగా, సినిమా తర్వాత టెలివిజన్ లో…

టెలికాస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టగా లేట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్ టెలికాస్ట్ లో కేవలం 5.14 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకోగా రీసెంట్ గా రెండోసారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా రెండో సారి మాత్రం మంచి జోరు ని చూపించడం విశేషం.

చాలా వరకు సినిమాలు ఫస్ట్ టెలికాస్ట్ తో పోల్చితే సెకెండ్ టెలికాస్ట్ లో రేటింగ్ తగ్గుతూ ఉంటుంది, కానీ వాల్తేరు వీరయ్య సినిమా సెకెండ్ టెలికాస్ట్ లో జెమినీ టీవీ లో 7.37 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని మొదటి టెలికాస్ట్ కన్నా కూడా సెకెండ్ టెలికాస్ట్ లో దుమ్ము లేపే రేంజ్ లో జోరు చూపించింది.

చాలా లేట్ టెలికాస్ట్ వలన సినిమా కి ఫస్ట్ టైం చాలా తక్కువ రేటింగ్ సొంతం అవ్వగా రెండో సారి టెలికాస్ట్ లో బాగానే పుంజుకున్న వాల్తేరు వీరయ్య సినిమా టెలివిజన్ లో లాంగ్ రన్ లో ఇలానే జోరు కొనసాగిస్తే ఛానెల్ కొన్న రేటుకు ఫుల్ న్యాయం చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here