బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమా ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టింది…అన్ని చోట్లా సినిమా మరోసారి ఎలాంటి పోటి అనేదే లేకుండా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఊరమాస్ ఊచకోతని కొనసాగించడానికి సిద్ధం అవుతూ ఉండగా రెండో వారంలో సినిమా హోల్డ్ చేసిన థియేటర్స్ కౌంట్ ఎంతవరకు ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని రెండో వారంలో కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.
మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో కల్కి మూవీ ఆల్ మోస్ట్ 1250 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. సోలో రిలీజ్ అవ్వడంతో బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాకి రెండో వారంలో అడ్డు నిలిచే సినిమానే లేకపోవడంతో రెండో వారంలో నైజాంలో 350 వరకు థియేటర్స్ లో సీడెడ్ లో 220 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండగా…
ఆంధ్ర రీజన్ లో 450 కి పైగా థియేటర్స్ లో సినిమా రెండో వారంకొనసాగిస్తుంది. దాంతో రెండో వారంలో ఓవరాల్ గా 1000 కి పైగానే థియేటర్స్ లో సినిమా రన్ కొనసాగుతుంది, అంటే ఫస్ట్ వీక్ తో పోల్చితే కేవలం 250 వరకు థియేటర్స్ మాత్రమే తగ్గాయి. ఇక హిందీలో రెండో వారంలో 2600 వరకు స్క్రీన్స్ లో రన్ కాబోతున్న ఈ సినిమా…
కర్ణాటక, తమిళ్ కేరళ ఇలా మిగిలిన అన్ని చోట్లా కలిపి మరో 850 థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగించనుండి…దాంతో ఓవరాల్ గా రెండో వారంలో ఇండియాలోనే సినిమా 4500 థియేటర్స్ లో రన్ ని కొనసాగించనుంది…ఈ రేంజ్ లో రెండో వారంలో థియేటర్స్ ని హోల్డ్ చేయడం…
రీసెంట్ టైంలో ఒక్క కల్కికి మాత్రమే సొంతం అయ్యింది. ఈ రేంజ్ లో థియేటర్స్ ని హోల్డ్ చేసిన కల్కి ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి చేరువ అవ్వగా అంచనాలకు తగ్గట్లు రెండో వారంలో జోరు చూపిస్తే లాభాలను కూడా సాలిడ్ గా సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.