మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే కొంచం చిన్న ఇండస్ట్రీగా చెప్పుకునే ఇండస్ట్రీ మలయాళ ఇండస్ట్రీ….. ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడానికి ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే చాలా టైం పట్టింది ఈ ఇండస్ట్రీకి…
అయినా కూడా ఈ ఇయర్ భారీగా కలిసి వచ్చింది మలయాళ ఇండస్ట్రీకి, అన్ సీజన్ అయిన ఫిబ్రవరి మార్చ్ నెలల్లో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే వరుస బ్లాక్ బస్టర్స్ దుమ్ము లేపిన మలయాళ ఇండస్ట్రీ ఆల్ మోస్ట్ 2 వారాల గ్యాప్ లో వాళ్ళ హిస్టరీలో ఏ సినిమాలు సాధించని రేంజ్ లో…
వసూళ్ళ రికార్డులను నమోదు చేశాయి….రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుండి కేవలం 2 వారాల గ్యాప్ లో 3 సినిమాలు రిలీజ్ అవ్వగా అవన్నీ కలిపి మలయాళ ఇండస్ట్రీ తరుపున బెస్ట్ బాక్స్ ఆఫీస్ వసూళ్ళని సొంతం చేసుకున్నాయి… ప్రేమలు(Premalu Movie), తర్వాత మమ్ముట్టి(Mammootty) భ్రమయుగం(Brama Yugam Movie)….
తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసింది… మొత్తం మీద ఈ మూడు సినిమాలు కలిపి 2 వారాల గ్యాప్ లో వరల్డ్ వైడ్ గా 375 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించాయి….
అందులో భ్రమయుగం మూవీ 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా, ప్రేమలు మూవీ 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మంజుమ్మేల్ బాయ్స్ 200 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా మూడు సినిమాలు కలిపి 375 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. లాంగ్ రన్ లో 400 కోట్ల రేంజ్ కి వసూళ్లు ఓవరాల్ గా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.