అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఫిబ్రవరి లాంటి నెలలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని హిందీ లో సొంతం చేసుకోవడమే కాకుండా హిస్టారికల్ జానర్ లో ఎపిక్ రికార్డులను నమోదు చేసిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగు లో కూడా వీర లెవల్ లో…
కుమ్మేస్తూ ఇప్పుడు రెండు వారాలను దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని మాస్ ఊచకోత కోసింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా అనుకున్న దాని కన్నా కూడా…
లాభాలను మరింతగా పెంచుకుని వీర లెవల్ లో కుమ్మేయడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజున 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మరోసారి 14వ రోజున పెద్దగా డ్రాప్స్ లేకుండా అదే రేంజ్ లో 40 లక్షల దాకా గ్రాస్ ను…
సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా షేర్ మరోసారి 20 లక్షల రేంజ్ లో సొంతం చేసుకోగా టోటల్ గా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి సినిమా ఇక్కడ 17.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా…
ఓవరాల్ గా షేర్ పరంగా 8.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మొత్తం మీద సినిమా 3 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 5.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది.