బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) రెండు వారాలను కంప్లీట్ చేసుకుంది. సినిమా రెండో వీకెండ్ వరకు ఎంతో కొంత పర్వాలేదు అనిపించినా కూడా వర్కింగ్ డేస్ లో మాత్రం కంప్లీట్ గా స్లో అయింది సినిమా…
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజున 8 లక్షల షేర్ ని 14వ రోజున 6 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా మరో 6 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Family Star 2 weeks(14 Days) Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 5.04Cr
👉Ceeded: 98L
👉UA: 1.12Cr
👉East: 71L
👉West: 59L
👉Guntur: 73L
👉Krishna: 68L
👉Nellore: 56L
AP-TG Total:- 10.41CR (18.80CR~ Gross)
👉KA+ROI: 1.45Cr
👉OS: 4.90Cr
Total WW:- 16.76CR(32.10CR~ Gross)
మొత్తం మీద సినిమా 44 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా సినిమా 2 వారాల్లో సాధించిన రికవరీ 40% లోపే ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 27.24 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు లాస్ ను కవర్ చేసుకుంటుందో చూడాలి ఇక…