Home న్యూస్ శర్వానంద్ మనమే టీసర్ రివ్యూ…శర్వా కి హిట్ పక్కా!!

శర్వానంద్ మనమే టీసర్ రివ్యూ…శర్వా కి హిట్ పక్కా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూసిన హీరోలలో ఒకరైన శర్వానంద్(Sharwanand) రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే ఒక జీవితం సినిమాతో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుని మంచి విజయాన్ని దక్కించుకోగా ఆ సినిమా తర్వాత శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమా మనమే(Maname Movie) మూవీ…

ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు మేకర్స్… టీసర్ చూసిన తర్వాత శర్వానంద్ కి ఈ సినిమా మరో మంచి హిట్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అనిపించేలా మెప్పించింది అని చెప్పాలి…

హీరో హీరోయిన్స్ ఇద్దరూ వేరు వేరు అభిప్రాయలు ఉన్న వ్యక్తులు….అలాంటి వీళ్ళు అనుకోకుండా పెళ్లి చేసుకుంటారు…. ఒక బాబు పుట్టిన తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మొత్తం మీద మనమే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

 చాలా టైం తర్వాత ఒకప్పటి కామెడీ టచ్ ను మళ్ళీ ఈ సినిమాలో చూపించి మెప్పించబోతున్న శర్వానంద్ లుక్స్ బాగుండగా కృతి శెట్టి కూడా బాగుంది… టీసర్ క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండగా క్లాస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ టచ్ తో మనమే సినిమా తో శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here