Home న్యూస్ బాలీవుడ్ లో స్త్రీ2 అల్లకల్లోలం….ఆ బడ్జెట్ ఏంటి…2 వీక్స్ లో ఈ కలెక్షన్స్ ఏంటి!!

బాలీవుడ్ లో స్త్రీ2 అల్లకల్లోలం….ఆ బడ్జెట్ ఏంటి…2 వీక్స్ లో ఈ కలెక్షన్స్ ఏంటి!!

0

రిలీజ్ అయిన రోజు నుండి బాలీవుడ్ బాక్స్ అఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) ఊహకందని కలెక్షన్స్ తో అంచనాలను మించి లాభాలను సొంతం చేసుకుంటూ బడ్జెట్ మీద కూడా ఊహకందని కలెక్షన్స్ ని సాధిస్తూ ఇప్పుడు…

బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలు కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా 625 కోట్ల రేంజ్ లో సెన్సేషనల్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. సినిమా రెండో వారంలో వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 10 కోట్లకు తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని అన్ని రోజులు…

సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోస్తూ ఇప్పుడు ఇండియాలో 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషమని చెప్పాలి ఇప్పుడు. సినిమా 14వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 10.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా సినిమా…

2 వారాల్లో ఇండియాలో సాధించిన నెట్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Stree2 Day WISE Collections Report
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
👉Day 10 – 33.80CR
👉Day 11 – 40.75CR
👉Day 12 – 20.20CR
👉Day 13 – 12.25CR
👉Day 14 – 10.40CR
Total Collections – 444.50CR NET💥💥💥💥

మొత్తం మీద 2 వారాలు పూర్తి అయ్యే టైంకి సినిమా ఇండియాలో 520 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో 106 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 626 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది…

సినిమా ఓవరాల్ గా 100 కోట్ల లోపే బడ్జెట్ తో రూపొందగా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బిజినెస్ ను రికవరీ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుంటూ ఎపిక్ ప్రాఫిట్స్ తో ఓ రేంజ్ లో కుమ్మేస్తూ ఉండటం విశేషం….ఇక మూడో వీకెండ్ లో సినిమా మళ్ళీ రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here