Home న్యూస్ 3 రోజుల్లో ఇండియా లో టాప్ 2….మాస్ జాతర ఇది!!

3 రోజుల్లో ఇండియా లో టాప్ 2….మాస్ జాతర ఇది!!

0

 గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని ఇప్పుడు పూర్తీ చేసుకుంది. సినిమా మాస్ సెంటర్స్ లో దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా నైజాం లో మాత్రం ఎందుకో మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. అయినా కానీ ఓవరాల్ గా వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి అన్ని చోట్లా కలిపి సినిమా ఇండియా లో…

సెకెండ్ వేవ్ తర్వాత వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఇండియా లోనే టాప్ ప్లేస్ ను సెకెండ్ వేవ్ తర్వాత సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ కి వచ్చే సరికి…

Seetimaarr 3 Days Total Collections

నైజాంలో దెబ్బ పడటం వలన కొంచం స్లో అయ్యి ఇండియన్ మూవీస్ పరంగా టాప్ 2 ప్లేస్ ను దక్కించుకుంది… ఓవరాల్ గా వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల నుండి 10.21 కోట్ల గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ తో కలిపి టోటల్ గా…

10.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది… ఇండియన్ మూవీస్ లో అక్షయ్ కుమార్ బెల్ బాటం 2200 స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వగా 4 రోజుల వీకెండ్ లో 13 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 16 కోట్ల గ్రాస్ ను అందుకుంది… అదే టైం లో సీటిమార్ సినిమా 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 3 రోజుల వీకెండ్ లో 10.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.

మూడు రోజుల లెక్క చూసుకుంటే బెల్ బాటం సినిమా 8.55 కోట్ల నెట్ కలెక్షన్స్ ని 10.5 కోట్ల గ్రాస్ ను అందుకుంది, ఆ లెక్కలో చూసుకుంటే సీటిమార్ టాప్ లో ఉంటుంది కానీ ఓవరాల్ వీకెండ్ లెక్కలో చూసుకుంటే ప్రస్తుతం టాప్ 2 ప్లేస్ లో వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Seetimaarr 2 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here