Home న్యూస్ లవ్ స్టొరీ ట్రైలర్ రివ్యూ…బ్లాక్ బస్టర్ పక్కా!!

లవ్ స్టొరీ ట్రైలర్ రివ్యూ…బ్లాక్ బస్టర్ పక్కా!!

0

లాస్ట్ ఇయర్ నుండి యూత్ ఆశగా ఎదురు చూస్తున్న సినిమాలలో నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టొరీ ఒకటి… మీడియం రేంజ్ మూవీ నే అయినా సాలిడ్ అంచనాలను క్యారీ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ నెల 24 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా…

లాంచ్ చేశారు… ట్రైలర్ లోనే సినిమా కథ పాయింట్ ని ఆల్ మోస్ట్ రివీల్ చేశారు మేకర్స్… డాన్సర్ అయినా లైఫ్ లో సెటిల్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్న హీరో, బి టెక్ చదివి జాబ్ కోసం కష్టపడుతున్న హీరోయిన్… మంచి డాన్సర్ అయిన హీరోయిన్ హీరోతో కలిసిన తర్వాత…

ఇద్దరూ ప్రేమలో పడటం తర్వాత వాళ్ళ ప్రేమని హీరోయిన్ ఇంటి పెద్దలు నో చెప్పడం తో తర్వాత ఏం జరిగింది అన్న కథ పాయింట్ తో సినిమా తెరకెక్కింది అని ట్రైలర్ చూస్తె కథ అర్ధం అవుతుంది, కథ ఆల్ రెడీ చాలా సినిమాల్లో చూసినట్లు ఉన్నా కంప్లీట్ గా…

శేఖర్ కమ్ముల క్లాస్ టచ్ తో మంచి ఎమోషనల్ సీన్స్ తో ట్రైలర్ బాగా ఆకట్టుకుంది….. నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరూ కూడా అద్బుతంగా కనిపించగా ఇద్దరి తెలంగాణా డైలాగ్ డిలివరీ ఆకట్టుకుంది. ఇద్దరి పెయిర్ కూడా బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి… ఓవరాల్ గా ట్రైలర్ ఇప్పటి వరకు సినిమా పై ఉన్న…

అంచనాలను మరింత పెంచే విధంగా మెప్పించింది అని చెప్పాలి. ఇక 24 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్స్ అఫీస్ దగ్గర నిజంగానే సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపడం ఖాయం… ఇక ఈ ట్రైలర్ మొదటి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here