అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీ అంటే మహా అయితే 30-40 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తే గొప్ప అనుకున్న రోజుల్లో ఒక్కసారి అయినా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన KGF సినిమా బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీ పేరుని ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా…
పాపులర్ అయ్యేలా చేసిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగు లో 4.5 కోట్ల బిజినెస్ ని అందుకున్నప్పుడు ఈ సినిమా బిజినెస్ ను రికవరీ చేస్తుందా అన్న డౌట్ ఉండగా టోటల్ రన్ లో ఏకంగా 13 కోట్ల రేంజ్ షేర్ ని…
సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇక హిందీలో చాలా స్లో స్టార్ట్ ను సొంతం చేసుకుని పోటిలో షారుఖ్ ఖాన్ జీరో సినిమాను కూడా మించి పోయే విజయాన్ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమా అన్ని చోట్లా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
రీసెంట్ గా సినిమా మూడేళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తీ చేసుకోగా ఒకసారి సినిమా సాధించిన టోటల్ గ్రాస్ అండ్ షేర్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే..
Karnataka – 136Cr – 72cr
Hindi Version – 57Cr – 30cr
Telugu Version – 23Cr – 13cr
Tamil Version 8.5 Cr – 4.5r
Kerala 3 Cr – 1.3cr
Overseas 14.5cr – 8cr
Total WW Gross 242 cr – 128.8cr
ఇదీ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ భీభత్సం. సినిమాను ఆ టైం లో 45 కోట్ల రేటుకి అమ్మగా ఈ రేటుని సినిమా రికవరీ చేస్తుందా లేదా అన్న డౌట్స్ ఉండగా సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 128.8 కోట్ల షేర్ తో బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 83.5 కోట్ల ప్రాఫిట్ తో కన్నడ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మాస్ ఎలివేషన్స్ యుఫోరియా మరింత కాలం ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది.