Home గాసిప్స్ 30 కోట్ల సినిమా…45 కోట్లు ఎక్స్ పెర్ట్ చేస్తే షాకింగ్ బిజినెస్ ఆఫర్!!

30 కోట్ల సినిమా…45 కోట్లు ఎక్స్ పెర్ట్ చేస్తే షాకింగ్ బిజినెస్ ఆఫర్!!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు, తమిళ్ లో చేసిన ప్రతీ సినిమా ను కూడా తెలుగు లో క్రమం తప్పకుండా డబ్ అయ్యేలా చూసుకునే విశాల్ రీసెంట్ టైం లో కొన్ని ఫ్లాఫ్స్ ని అక్కడా ఇక్కడా ఎదురుకున్నాడు. అభిమన్యుడు, పందెం కోడి 2 లాంటి సినిమాలతో మెప్పించినా తర్వాత చేసిన సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేక ఫ్లాఫ్ అయ్యాయి.

లాస్ట్ ఇయర్ చేసిన యాక్షన్ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందిన కలెక్షన్స్ ని వసూల్ చేయలేక ఫ్లాఫ్ అవ్వగా అయినా కానీ మళ్ళీ 30 కోట్ల రేంజ్ బడ్జెట్ తో చక్ర అనే మరో అభిమన్యుడు టైప్ సినిమా తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు విశాల్. ఈ సినిమా ట్రైలర్ ని…

రీసెంట్ గా లాంచ్ చేయగా మంచి రెస్పాన్స్ రాగా సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు, సుమారు 45 కోట్ల రేంజ్ రేటు అన్ని భాషల్లో కలిపి వస్తే సినిమా ను డైరెక్ట్ రిలీజ్ చేయాలనీ చూశారు కానీ అంత పెద్ద ఆఫర్స్ అయితే ఎవ్వరూ కోట్ చేయలేదని సమాచారం…

కాగా రీసెంట్ గా జీ 5 వాళ్ళు ఈ సినిమా కి 32 కోట్ల రేంజ్ లో రేటు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అని లేటెస్ట్ గా ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. సౌత్ లో అన్ని భాషలకు కలిపి ఈ రేటు చెల్లించడానికి వాళ్ళు ముందుకు వచ్చారని అంటున్నారు. కానీ నిర్మాతల నుండి ఇంకా ఫైనల్ నిర్ణయం….

ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉందని అంటున్నారు. బడ్జెట్ దృశ్యా మంచి రేటు నే సినిమా కి దక్కింది అని చెప్పాలి కానీ టీం అంచనా 45 కోట్ల రేంజ్ లో ఉండటం తో మరికొన్ని చర్చలు జరిపి రేటు కొంచం అటూ ఇటూగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి ఇంతకు ఫిక్స్ అవుతారు అన్నది త్వరలో తేలబోతుంది అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here