రిలీజ్ అయిన 5వ వీకెండ్ లో సైతం కొత్త సినిమాలను అన్నీ కూడా డామినేట్ చేస్తూ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part1) ఇప్పుడు 5వ వారం వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా ఓవరాల్ గా ఇప్పటికీ మంచి హోల్డ్ ని చూపెడుతూ షేర్స్ ని రాబడుతూ ఉండగా…
సినిమా 31వ రోజుతో పోల్చితే 32వ రోజున సినిమా మంచి హోల్డ్ ని చూపించిన సినిమా 33వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే లో సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని కొనసాగిస్తూ షేర్స్ ని ఇంకా రాబడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 33వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 16-18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ 18-20 లక్షల దాకా వెళ్ళే అవకాశం కొద్ది వరకు ఉంది.
మొత్తం మీద సినిమా మరోసారి మంచి హోల్డ్ నే చూపించగా తెలుగు రాష్ట్రాల ఆవల ఆల్ మోస్ట్ సినిమా రన్ కంప్లీట్ అయ్యినట్లే అని చెప్పాలి, హిందీలో చాలా లిమిటెడ్ గానే సినిమా రన్ అవుతూ ఉండగా 33వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా…
షేర్ ని ఇప్పుడు అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతున్న దేవర మూవీ దీపావళి మూవీస్ ఇక రాబోతున్నాయి కాబట్టి థియేటర్స్ ని ఇంకా కోల్పోయే అవకాశం ఉండటంతో ఉన్న థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…