మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేంజ్ చూపెట్టి చాలా కాలమే అవుతుంది, ఇది వరకు ఇయర్ కి మినిమమ్ మూడు – నాలుగు సినిమాలు చేస్తూ అందులో కచ్చితంగా రెండుకి తగ్గని హిట్స్ కొడుతూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా మాస్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసిన రవితేజ తర్వాత ఇయర్ కి ఒకటి రెండు సినిమాలు మాత్రమె కమిట్ అవుతూ హిట్స్ పరంగా స్లో అయ్యాడు.
ఇక రాజా ది గ్రేట్ కి ముందు గ్యాప్ ఇచ్చి ఈ సినిమా తో కంబ్యాక్ సాలిడ్ గా చేసినా తర్వాత చేసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికి మించి ఒకటి డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుని నిరాశ పరచగా ఇప్పుడు ఆశలన్నీ కూడా అప్ కమింగ్ మూవీ క్రాక్ మీదే పెట్టుకున్నాడు.
కాగా కరోనా ఎఫెక్ట్ వలన అన్ని సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుండగా ఈ సినిమా కి కూడా డిజిటల్ రిలీజ్ ఆఫర్ లు వచ్చినా నో చెప్పారు నిర్మాతలు. రవితేజ కి ఇది మంచి కమర్షియల్ కంబ్యాక్ అవుతుంది అన్న నమ్మకం ఒక మెయిన్ కారణం అయితే…
సినిమా కి వచ్చిన డిజిటల్ రిలీజ్ ఆఫర్ మరో కారణం అని ఇండస్ట్రీ లో టాక్ ఉంది… సినిమా కి బడ్జెట్ పరంగా రవితేజ ఫ్లాఫుల్లో ఉన్నా కానీ కథ మీద నమ్మకంతో ఏకంగా 34 కోట్ల మేర ఖర్చు చేశారట. కానీ డిజిటల్ రిలీజ్ ఆఫర్లు ప్రస్తుతం రవితేజ ఫామ్ ని కన్సిడర్ చేసి…
కేవలం 22 కోట్ల రేంజ్ లో నే కోట్ చేశారట…. దాంతో పెట్టిన బడ్జెట్ కి ఈ రేటు చూసి సినిమాను ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేసి తీరుతామని నిర్ణయం తీసుకున్నారట యూనిట్, ఇక సినిమా థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక పరిస్థితులను బట్టి ఓ మంచి డేట్ చూసుకుని రిలీజ్ కానుంది. రవితేజ కూడా ఈ సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయం అన్న కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. అది నిజం అవ్వాలని కోరుకుందామ్…