Home గాసిప్స్ యంగ్ టైగర్ డైలాగ్…ఇప్పుడు బాలయ్య మూవీ టైటిల్!

యంగ్ టైగర్ డైలాగ్…ఇప్పుడు బాలయ్య మూవీ టైటిల్!

1286
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ పై అంచనాలు సాలిడ్ గా ఉన్న విషయం తెలిసిందే, సింహా లెజెండ్ లాంటి రెండు బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడం తో ప్రస్తుతం ఇద్దరి ఫాం కూడా ఆశించిన విధంగా లేకున్నా కానీ ఈ సినిమా పై మాత్రం…

సినిమా మొదలు అయినప్పటికీ క్రేజ్ భారీగా ఉండగా సినిమా టీసర్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుండి మరింత అన్చనాలూ పెరిగాయి అని చెప్పాలి. కాగా సినిమా అన్నీ బాగానే సెట్ అవుతున్నాయి కానీ టైటిల్ విషయం లో మాత్రం యూనిట్ ఆశించిన పవర్ ఫుల్ టైటిల్ అయితే..

ఇంకా దొరకలేదు అన్నే చెప్పాలి, చాలా టైటిల్స్ పరిశీలన లోకి వచ్చినా కానీ ఏది కూడా ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు, లేటెస్ట్ గా డేంజర్ దగ్గర ఆగిన టైటిల్ వేట ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ దగ్గరకు వచ్చి ఆగింది అని అంటున్నారు. ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ…

అరవింద సమేత లో ఫేమస్ అయిన టార్చ్ బేరర్ అనే డైలాగ్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కి ఆ టైటిల్ ని పరిశీలిస్తున్నారని అంటున్నారు. మరి ఈ టైటిల్ అయినా ఫైనల్ అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉండగా ఉన్న టైటిల్స్ లో ఈ టైటిల్ లేదా తిరిగి మోనార్క్ ని…

సెలెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ ఇండస్ట్రీ లో ఉంది. మరి ఫైనల్ గా ఏది ఫిక్స్ అవుతారో చూడాలి. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి త్వరలో మొదలు కాబోతుండగా నాన్ స్టాప్ గా షూటింగ్ జరిగితే పరిస్థితులను బట్టి సినిమాను సంక్రాంతి రేసు లో లేదా సమ్మర్ కి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తుందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here