బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన లాస్ట్ 9 సినిమాల్లో కేవలం 2 సినిమాలతో మాత్రమే అంచనాలను అందుకుని హిట్ కొట్టిన బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) ఇప్పుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) తో కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan) ఈ రంజాన్ కానుకగా…
ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 350 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ ను పెట్టారు. ఈ ఇయర్ బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఇదే అంటూ ఓ రేంజ్ లో హైప్ ను పెంచారు కానీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న సినిమా….
అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా మొదటి రోజు మొత్తం మీద కేవలం 1600 టికెట్ సేల్స్ మాత్రమే సేల్ అయ్యాయి, సినిమాపై పెంచిన హైప్ కి టికెట్ సేల్స్ స్కై రాకెట్ లెవల్ లో దుమ్ము లేపుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఈ టికెట్ సేల్స్ చూసి టోటల్ బాలీవుడ్ కూడా శాకవుతుంది ఇప్పుడు…
భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా బుకింగ్స్ మరీ నిరాశ పరిచే విధంగా ఉండటంతో ఇప్పుడు మొదటి రోజు ఇండియాలో 20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్నా అది రిమార్కబుల్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు అంటున్నారు. మరి సినిమా ప్రీ రంజాన్ ఎఫెక్ట్ తగ్గి టికెట్ సేల్స్ లో జోరు చూపించి అంచనాలను మించిపోయి బడ్జెట్ కి న్యాయం చేసే రేంజ్ ఓపెనింగ్స్ ను అందుకుంటుందో లేదో చూడాలి ఇక…