Home న్యూస్ 3 డేస్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

3 డేస్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

అప్పట్లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో మంచి విజయాన్నే సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు(pradeep machiraju) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada Abbayi Movie) సినిమాతో మరో హిట్ ని సొంతం చేసుకుంటాడు అని అందరూ అనుకోగా…

సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా మూడో రోజు మాత్రం ఎట్టకేలకు సండే అడ్వాంటేజ్ తో కొంచం గ్రోత్ ని చూపించి…

6.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించింది కానీ ఇంకొంచం జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద మూడో రోజు సినిమా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ లో…

గ్రాస్ మార్క్ ని అందుకుంది. మొత్తం మీద సినిమా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 95 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఇంకా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here