Home న్యూస్ చిన్న సినిమా 3వ రోజు భీభత్సం….మసూద 3 డేస్ టోటల్ కలెక్షన్స్!

చిన్న సినిమా 3వ రోజు భీభత్సం….మసూద 3 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా మసూద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు మొదటి వీకెండ్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సినిమా మూడో రోజు ఆల్ మోస్ట్ రాంపేజ్ అంటే ఇదే అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో అక్షరాలా 1.48 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… ఈ రేంజ్ లో కలెక్షన్స్ ఒక చిన్న సినిమా కి సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 1.32Cr
👉Ceeded – 35L
👉Andhra – 1.48Cr
Total AP TG:- 3.15CR~Gross(1.70~ Share )
👉WW -3.35cr~ Gross(1.80~ Share )
ఇదీ సినిమా వీకెండ్ టోటల్ కలెక్షన్స్ లెక్క…

సినిమా టోటల్ వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 1.3 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. దాంతో సినిమా హిట్ అవ్వాలి అంటే 1.50 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా 3 రోజుల్లో ఆ మార్క్ ని అందుకుని ఇప్పుడు 30 లక్షల ప్రాఫిట్ ను అందుకుని సూపర్ హిట్ వైపు దూసుకు పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here