బాక్స్ ఆఫీస్ దగ్గర పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా మిక్సుడ్ గానే రావడంతో కలెక్షన్స్ పరంగా సినిమా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది. కానీ మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో ఉన్నంతలో కొంచం బెటర్ గానే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ మొత్తం మీద…
అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. ఇక సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల నుండి 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కానీ సినిమా కొంచం బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా…
68 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా అన్ని చోట్లా అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 92 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. టోటల్ గా 1.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది సినిమా…
మొత్తం మీద సినిమా ఇప్పుడు మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 78L
👉Ceeded: 22L
👉UA: 29L
👉East: 20L
👉West: 14L
👉Guntur: 26L
👉Krishna: 19L
👉Nellore: 12L
AP-TG Total:- 2.20CR(3.80CR~ Gross)
👉Ka+ROI: 15L
👉OS – 40L
Total WW: 2.75CR(5.00CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ అఫీస్ దగ్గర వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్…
రంగ రంగ వైభవంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా వీకెండ్ తర్వాత సినిమా ఇంకా 6.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, సినిమా టార్గెట్ చిన్నదే అయినా ఓవరాల్ గా నిరాశపరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.