Home న్యూస్ 2024-మూడు నెలల్లో టాప్ 2…..ఊచకోత కోసిన టిల్లు స్క్వేర్!!

2024-మూడు నెలల్లో టాప్ 2…..ఊచకోత కోసిన టిల్లు స్క్వేర్!!

0

2024 ఇయర్ స్టార్ట్ అయ్యి 3 నెలలు ఆల్ మోస్ట్ కంప్లీట్ అయింది, మొదటి నెలలో సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ తో కొన్ని సినిమాలు మంచి ఓపెనింగ్స్ ను అందుకున్న తర్వాత ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలలో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను ఏ సినిమాలు క్రియేట్ చేయలేక పోయాయి….ఇక ఆడియన్స్ ముందుకు మార్చ్ ఎండ్ లో…

సమ్మర్ కానుకగా వచ్చిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే ఓపెనింగ్స్ ను అందుకుంది. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 9.25 కోట్ల రేంజ్ లో సాలిడ్ ఓపెనింగ్స్ ను…

సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది…మొత్తం మీద సినిమా ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుని సంచలనం సృష్టించింది. ఒకసారి ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే…

2024 Tollywood Movies top 1st Day Collections in AP-TG
👉#GunturKaaram – 38.88CR
👉#TilluSquare – 9.25CR******
👉#HanuMan – 7.97CR(Inc Premieres)
👉#NaaSaamiRanga – 4.30CR
👉#Eagle – 3.93CR
👉#Gaami – 2.96CR
👉#Saindhav – 2.38Cr
👉#Bhimaa – 2.08CR

మొత్తం మీద గుంటూరు కారం మూవీ ఈ ఇయర్ టాప్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపగా రెండో ప్లేస్ లో టిల్లు స్క్వేర్ మూవీ సంచలన ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇక ఈ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి ఇంకా 9 నెలల టైం ఉండటంతో ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో టాప్ ప్లేస్ లో ఉన్న గుంటూరు కారం సినిమాను ఏ సినిమాలు బ్రేక్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here