Home న్యూస్ ఎన్టీఆర్ మహానాయకుడు మూడో రోజు ఓపెనింగ్స్…చరిత్రకెక్కడం ఖాయం ఇక!

ఎన్టీఆర్ మహానాయకుడు మూడో రోజు ఓపెనింగ్స్…చరిత్రకెక్కడం ఖాయం ఇక!

0

     2019 జనవరి కి ముందు వరకు ఈ ఇయర్ లో మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ముందు నిలిచిన సినిమాల్లో బాలయ్య నటించిన ఎన్టీఆర్ సిరీస్ ముందు నిలిచింది, స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆదరంగా తెరకేక్కడం తో సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది అని భావించారు, అందునా సావిత్రి గారి బయోపిక్ మహానటి ఊహించని బ్లాక్ బస్టర్ అవ్వడం తో తెలుగు వారి ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ సినిమా…

బిగ్గెస్ట్ రికార్డుల దుమ్ము దుమారం చేస్తుంది అనుకున్నా మొదటి పార్ట్ ఊహించని ఆల్ టైం డిసాస్టర్ అవ్వగా ఇప్పుడు రెండో పార్ట్ మొదటి పార్ట్ ని మించే డిసాస్టర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవడానికి ఉవ్విళ్ళూరుతూ దూసుకు పోతుంది, తొలి రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఈ సినిమా కేవలం 2.72 కోట్ల రేంజ్ షేర్ ని మాత్రమె అందుకోగా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఊహించని స్థాయి లో మరింత పడిపోయి దయనీయ స్థితి లో ఉంది, పర్వాలేదు బాగుంది అన్న టాక్ ఉన్నా కానీ ఈ రేంజ్ లో పడిపోవడం చూసి,

థియేటర్ ఓనర్లు, కొన్న బయ్యర్లు బోరుమంటున్నారు, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఓపెనింగ్స్ రెండో రోజు తో పోల్చితే 50% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోల లో గ్రోత్ ని అందుకొక పొతే మాత్రం సినిమా మూడో రోజు..

కేవలం 25 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, అదే జరిగితే సినిమా చరిత్రకెక్కే డిసాస్టర్ గా మిగిలి పోవడం ఖాయం అని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఎండింగ్ కి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here