Home న్యూస్ ప్రతీరోజూ పండగే డే 3 ఓపెనింగ్స్…వీర లెవల్ భీభత్సం ఇది!!

ప్రతీరోజూ పండగే డే 3 ఓపెనింగ్స్…వీర లెవల్ భీభత్సం ఇది!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 2 రోజుల్లోనే సాలిడ్ కలెక్షన్స్ ని వెనక్కి తీసుకువచ్చింది, ముఖ్యంగా రెండో రోజు సినిమా అందరి అంచనాలను మించే కలెక్షన్స్ ని పోటి లో సాధించడం విశేషం.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుండటం విశేషం, సినిమా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రెండు షోలకు…

కేవలం 5% టు 10% లోపు డ్రాప్స్ ని మాత్రమె సొంతం చేసుకోవడం విశేషం, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ అదిరి పోయే రేంజ్ లో జరుగుతున్నాయి కాబట్టి సినిమా మూడో రోజు కూడా అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే సినిమా 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ అనుకున్న రేంజ్ లో ఉంటె…

ప్రతీరోజూ పండగే సినిమా మూడో రోజు 2.6 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది, ఆల్ మోస్ట్ వీకెండ్ లోనే 70% బిజినెస్ ని రికవరీ చేసేలా సినిమా జోరు చూపుతూ ఉండటం విశేషం, ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here