Home న్యూస్ “వరల్డ్ ఫేమస్ లవర్” డే 3 ఓపెనింగ్స్…ఇది షాక్ మీద షాక్!!

“వరల్డ్ ఫేమస్ లవర్” డే 3 ఓపెనింగ్స్…ఇది షాక్ మీద షాక్!!

0

     విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక చేతులు ఎత్తేసింది, 2.2 కోట్ల రేంజ్ లో షేర్ అనుకుంటే కేవలం 1.63 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకున్న సినిమా ఇప్పుడు మూడో రోజు అడుగు పెట్టింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత షాక్ ఇచ్చే రేంజ్ లో డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.

సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 2 వ రోజు తో పోల్చితే ఏకంగా 30% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏమంత ఆశాజనకంగా లేవని చెప్పాలి. దాంతో ఇప్పుడు సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

ప్రస్తుతం ఉన్న స్టేటస్ ని బట్టి 1 కోటి రేంజ్ లో షేర్ ని వసూల్ చేయోచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ ని సాధిస్తే లెక్క 1.2 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది, అయినా కానీ ఈ కలెక్షన్స్ సినిమా బిజినెస్ ని ఏమాత్రం రికవరీ చేయలేవు.

ఏదైనా అద్బుతం జరిగి వర్కింగ్ డేస్ లో కూడా ఇదే రేంజ్ కలెక్షన్స్ మరో 10 రోజుల పాటు కొనసాగినా కానీ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక మూడో రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మాస్ సెంటర్స్ పరంగా గ్రోత్ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మొదటి రోజు నుండే మాస్ సెంటర్స్ లో సినిమా మినిమమ్ ఇంపాక్ట్ కూడా చూపలేక పోవడం తో 2 రోజులుగా కలెక్షన్స్ పూర్తిగా అంచనాలను తప్పుతూ వస్తున్నాయి. ఇక మూడో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని వసూల్ చేస్తుందో చూడాలి. రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉందో చూసి అప్ డేట్ చేస్తామ్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here