9 నెలల తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ అవ్వగా జనాలను తిరిగి థియేటర్స్ కి రప్పించడానికి ధైర్యం చేసిన మొదటి పెద్ద సినిమా సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపగా రెండో రోజు మరోసారి అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హోల్డ్ చేసింది.
మొత్తం మీద రెండు రోజుల్లో ఏకంగా 5.45 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించిన సినిమా ఓవర్సీస్ లో పరిస్థితులు దెబ్బ కొట్టినా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో 4.8 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసి సంచలనం సృష్టించింది. ఇక సినిమా మూడో రోజు…
ఆది వారం అవ్వడం తో మరోసారి సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, రెండో రోజుతో పోల్చితే మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల డ్రాప్స్ కేవలం 10% రేంజ్ లోనే ఉండగా ఈవినింగ్ షోలకు వచ్చి సరికి కొన్ని సెంటర్స్ లో మంచి గ్రోత్ ని కొన్ని సెంటర్స్ లో…
సేం రెండో రోజు లెవల్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధించే దిశగా అడుగులు వేస్తుంది, రెండో రోజు నుండి టికెట్ రేట్లు పెంచడం కూడా సినిమా కి కలిసి వచ్చింది. ఇప్పుడు అదే అడ్వాంటేజ్ మూడో రోజు కూడా కొనసాగుతున్న నేపధ్యంలో సినిమా ఇప్పుడు మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం….
ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి… అంతకుమించి కూడా దుమ్ము లేపే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. నైట్ షోలకు పెద్దగా జనాలు మునుపటిలా రావడం లేదు, కానీ ఆదివారం కాబట్టి జనాలు వస్తే కనుక కచ్చితంగా ఈ మార్క్ ని కూడా సినిమా అధిగమించవచ్చు. ఇక వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.