బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ ఊహకందని నిరాశని మిగిలుస్తూ బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తూ ఉంది. సినిమా రెండో రోజు డ్రాప్ అయిన తీరు చూసిన తర్వాత ఇక తేరుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద రెండో రోజు 67 లక్షల షేర్ ని అందుకున్న తర్వాత…
మూడో రోజులో అడుగు పెట్టిన సినిమా సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించడం లేదు ఇప్పుడు. కొన్ని సెంటర్స్ లో రెండో రోజు లెవల్ లో ఓపెన్ అయినా కానీ చాలా సెంటర్స్ లో డ్రాప్స్ 20% రేంజ్ లో ఉన్నాయి.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజున 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది కానీ అవకాశం తక్కువగానే ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా మూడు రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఇప్పుడు బిజినెస్ ని చాలా దూరంలో ఆగిపోయేలా చేస్తుంది అని చెప్పాలి. ఇక సినిమా 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.