బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియన్ మూవీస్ రుద్రుడు మరియు శాకుంతలం సినిమాలు రెండూ కూడా మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మాత్రం ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక రెండు సినిమాలు ఆదివారం రోజున ఎంటర్ అవ్వగా మరోసారి 2 సినిమాలు పెద్దగా హోల్డ్ ని చూపించలేక పోతున్నాయి….
రుద్రుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించినా మిగిలిన సెంటర్స్ లో మాత్రం సినిమా మరింత స్లో డౌన్ అయింది. ఇక శాకుంతలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా కూడా మరింతగా స్లో డౌన్ అయిందని చెప్పాలి ఇప్పుడు.
శాకుంతలం సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు అటూ ఇటూగా 35 లక్షల నుండి 40 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక రుద్రుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…
కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక మరో కొత్త సినిమా విడుదల బాక్స్ అఫీస్ దగ్గర రెండో రోజు మరోసారి మొదటి రోజు లెవల్ లో జోరు చూపిస్తూ కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవాకాశం కనిపిస్తుంది. ఇక అన్ని సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.