మొదటి 2 రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, మూడో రోజు వినాయక చవితి పండగ అండ్ వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి జోరుని చూపెడుతుంది కానీ తెలుగు లో మాత్రం…
సినిమా పెద్దగా గ్రోత్ ని అయితే చూపించడం లేదు…ఓవరాల్ గా సినిమా రెండో రోజుతో పోల్చితే మూడో రోజు తెలుగులో పెద్దగా హోల్డ్ ని చూపించలేదు. దాంతో మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 80-90 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక సినిమా తమిళనాడులో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ ఉండగా 24-26 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా సినిమా ఈ రోజు కొంచం పర్వాలేదు అనిపించగా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను మరోసారి చూపెడుతూ ఉండటంతో సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 3వ రోజు అటూ ఇటూగా 54కోట్ల రేంజ్ నుండి 56కోట్ల రేంజ్ లో…
గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 58-60 కోట్ల రేంజ్ కి వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది. టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నా ఓవరాల్ గా సినిమా ఎక్స్ లెంట్ గానే కుమ్మేస్తుంది. ఇక టోటల్ గా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.