నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో ఊహాకందని కలెక్షన్స్ జోరు ని చూపెట్టి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. 4 వ రోజు అంచనాలను మరో సారి మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న అఖండ సినిమా…
ఇప్పుడు 4 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో మరో ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది. సినిమా ఇది వరకే 2 రోజులు తిరగక ముందే ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నైజాం ఏరియాలో…
4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను కూడా సొంతం చేసుకోవడం ఇప్పుడు విశేషం అని చెప్పాలి. ఇక్కడ సినిమా మొత్తం మీద 10.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు మొత్తం మీద 4.39 కోట్ల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా రెండో రోజు 2.26 కోట్ల షేర్ తో ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా మూడో రోజు గ్రోత్ చూపెట్టి 2.51 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని రచ్చ చేయగా ఇక నాలుగో రోజు రాంపేజ్ మరో లెవల్ కి చేరేలా దుమ్ము లేపిన ఈ సినిమా ఏకంగా 2.95 కోట్ల షేర్ ని అందుకుని…
సంచలనం సృష్టించింది. దాంతో సినిమా 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి 12.11 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను సొంతం చేసుకోవడం మొదలు పెట్టింది. సోమవారం కూడా హోల్డ్ చేస్తే ఇక్కడ లాంగ్ రన్ లో అఖండ సినిమా అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.