Home న్యూస్ ఎన్టీఆర్ కథానాయకుడు 4 డేస్ టోటల్ కలెక్షన్స్…డిసాస్టర్!

ఎన్టీఆర్ కథానాయకుడు 4 డేస్ టోటల్ కలెక్షన్స్…డిసాస్టర్!

0

  ఇలాంటి షాక్ బహుశా ఈ మధ్య కాలం లో మరే సినిమా విషయం లో కాలేదనే చెప్పాలి. మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కలెక్షన్స్ లేక థియేటర్స్ విలవిల బోవడం స్టార్ హీరోల సినిమాల విషయం లో అరుదు, కానీ బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ ప్రదర్శన చూస్తె ఎవరికైనా దిమ్మ తిరిగే షాక్ తగలాల్సిందే. ఆ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ప్రదర్శన ఉంది ఈ సినిమా కి.

మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా నాలుగో రోజు మరో కొత్త సినిమా F2 నుండి గట్టి పోటి ఎదురు అవ్వడం తో పుంజు కుంటుంది అనుకున్నా అది ఏమాత్రం అనుకున్న లెవల్ లో లేక ఆల్ మోస్ట్ 3 వ రోజు లెవల్ లో సినిమా కలెక్షన్స్ రాగా…

సినిమా మొత్తం మీద 4 వరోజు కేవలం 80 లక్షల లోపే షేర్ ని అందుకోగా ఓవరాల్ గా 4 రోజుల్లో 14 కోట్ల లోపు షేర్ తో 71.5 కోట్ల టార్గెట్ కి అందనంత లోతులో పడిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ వైపు అడుగులు వేస్తుంది. ఇక మీద అద్బుతాలు కాదు అంతకి మించి ఇంకా ఏదైనా జరిగితే తప్ప ఇదే నిజం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here