మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా డిఫెరెంట్ జానర్ మూవీ అవ్వడంతో ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారికి పర్వాలేదు అనిపించే విధంగా సినిమా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా రెగ్యులర్ ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా కూడా పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది.
మొదటి వీకెండ్ ఎలాగోలా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 4 వ రోజు మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా ఏమాత్రం హోల్డ్ ను సొంతం చేసుకోలేక పోయింది. సినిమా మినిమం 60 లక్షల షేర్ అయినా సొంతం చేసుకుంటుంది అని అంచనా వేసినా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ గట్టి ఎదురుదెబ్బ కొట్టడంతో సినిమా మొత్తం మీద కేవలం 40 లక్షల షేర్ ని మాత్రమె తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఇప్పుడు ఆల్ మోస్ట్ డిసైడ్ అయ్యింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 4 రోజుల్లో సాధించిన…
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.56Cr
👉Ceeded: 95L
👉UA: 64L
👉East: 36L
👉West: 34L
👉Guntur: 39L
👉Krishna: 35L
👉Nellore: 26L
AP-TG Total:- 4.85CR(8CR~ Gross)
Ka+ROI: 26L
OS – 40L
Total WW: 5.51CR(10.10CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్…
సినిమాను మారిన బిజినెస్ లెక్కల ప్రకారం 12 కోట్లకు అమ్మగా 12.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 6.99 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంటుంది, అది దాదాపు ఆసధ్యమే అని ఇప్పుడు వర్కింగ్ డేస్ కలెక్షన్స్ ని చూస్తె అర్ధం అవుతుంది… మరి మిగిలిన రోజుల్లో ఎంతో కొంత కలెక్షన్స్ తో లాస్ ని తగ్గిస్తుందో లేదో చూడాలి.