మంచి స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో రచ్చ చేయలేక పోయిన హీరోగా ఇది వరకు యువ సామ్రాట్ నాగ చైతన్య పేరు వినిపించేది. ఒక సినిమా హిట్ అయితే వెంటనే మరో సినిమా ఫ్లాఫ్ అయ్యేది, బాక్స్ ఆఫీస్ దగ్గర కన్సిస్టంట్ గా హిట్స్ ని సొంతం చేసుకోలేక పోయిన నాగ చైతన్య మజిలీ ముందు వరకు వరుస ఫ్లాఫ్స్ లో ఉండగా మజిలీ సినిమా తో తన కెరీర్ టర్న్ అయింది అని చెప్పాలి…
ఆ సినిమా సెన్సేషనల్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ తో వెంకిమామ చేసిన నాగ చైతన్య ఆ సినిమాతో మరో హిట్ ని సొంతం చేసుకోగా మల్టీ స్టారర్ కాబట్టి క్రెడిట్ ఇద్దరు హీరోలకు వెళుతుంది. ఇక లాస్ట్ ఇయర్ లవ్ స్టొరీ సినిమా కి పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కానీ…
సాలిడ్ హిట్ గా ఆ సినిమా నిలిచింది అని చెప్పాలి. పరిస్థితులు అన్నీ బాగుంటే మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ షేర్ ని అందుకుని ఉండేది ఆ సినిమా. ఇక ఆ సినిమా విజయం తర్వాత నాగార్జున తో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు సంక్రాంతి బరిలో ఎంటర్ అయ్యి సూపర్ కలెక్షన్స్ తో…
దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య కెరీర్ లో బాక్ టు బాక్ 4 సార్లు 50 కోట్ల గ్రాస్ మార్క్ ని ఇప్పుడు సొంతం చేసుకుని టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో ఏ హీరో కి కూడా సాధ్యం కానీ…
రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు నాగ చైతన్య… బంగార్రాజు కూడా మల్టీ స్టారర్ అయినా కానీ నాగార్జున రీసెంట్ మూవీస్ ఒక్కటి కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని చూపలేదు కానీ సోగ్గాడే సంచలన విజయం తర్వాత ఆ సినిమా సీక్వెల్ కాబట్టి ఇక్కడ కూడా క్రెడిట్ ఇద్దరికీ వెళుతుంది అని చెప్పాలి.