బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోల్లో మంచి క్రేజ్ ఉండి సరైన హిట్ పడని హీరోల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒకరు. పెర్ఫార్మెన్స్ పరంగా అదుర్స్ అనిపించుకున్నా మాస్ లో ఒక్క నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న తరుణం లో లాస్ట్ ఇయర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర తన కెరీర్ లో మొదటి 40 కోట్ల షేర్ ను అందుకున్నాడు.
ఇప్పుడు తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తడం సినిమా ను తెలుగు లో రెడ్ పేరుతొ రీమేక్ చేయగా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వలన మిగిలిన సమ్మర్ మూవీస్ తో కలిసి పోస్ట్ పోన్ అవ్వగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు.
ఇక లాక్ డౌన్ ఇలాగే మరింత కాలం కొనసాగే అవకాశం ఉండటం తో OTT ప్లాట్ ఫామ్స్ లో కొత్త సినిమాలను రిలీజ్ చేయాలనే ప్లాన్ పెరుగుతూ వస్తుంది, అందులో భాగంగా కొన్ని పెద్ద స్ట్రీమింగ్ యాప్స్ ఈ సినిమా కి భారీ రేటు ఆఫర్ చేస్తున్నాయట.
కానీ రీసెంట్ హిట్ తో పోల్చితే ఆ ఆఫర్ చాలా తక్కువే అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ తో 40 కోట్ల లీగ్ లో అడుగు పెట్టిన రామ్ న్యూ మూవీ రెడ్ కి 23 కోట్ల రేంజ్ లో స్ట్రీమింగ్ యాప్స్ నుండి ఆఫర్స్ వస్తున్నాయట. ఇది చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి కానీ రామ్ లాస్ట్ మూవీ కలెక్షన్స్ తో పోల్చితే సగమే…
కానీ రామ్ నుండి కానీ రెడ్ టీం నుండి ఈ ఆఫర్ కి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదట. సినిమా ను లాక్ డౌన్ అయ్యాక థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలి అని టీం గట్టిగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ లాక్ డౌన్ ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ కొత్త సినిమాలను తమ స్ట్రీమింగ్ యాప్స్ లో టెలికాస్ట్ చేయాలి అన్న OTT యాప్స్ ప్రయత్నాలు ఇలానే లేట్ అయితే కొన్ని సినిమాలకు ఫలించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు.
Ott platform ante enti anna