Home న్యూస్ అజిత్ కొత్త సినిమా….41M తో సోషల్ మీడియా షేక్ షేక్!!

అజిత్ కొత్త సినిమా….41M తో సోషల్ మీడియా షేక్ షేక్!!

0

సోషల్ మీడియాలో ఏదైనా సినిమా ప్రమోషన్స్ కి ఉపయోగ పడుతుంది…పోస్టర్ లు, టీసర్ లు, ట్రైలర్ లు, ప్రోమోలు, సాంగ్స్ ఇలా ఏవైనా సినిమా ప్రమోషన్స్ కి వాడుకోవడం కామన్, ఇక ఆ వీడియోలకు పోస్టర్ లకు సోషల్ మీడియాలో వచ్చే రీచ్ ను బట్టి ఆ సినిమాల మీద ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుస్తుంది…

అందుకే ఈ రికార్డులు దేనికి పనికి వస్తాయి అని కొందరు అనుకున్నా సినిమా రీచ్ ఎలా ఉంది అన్నది, ఆడియన్స్ లో క్రేజ్ కి ఇది ఉపయోగ పడుతుంది కాబట్టి మేకర్స్ ఈ ప్రమోషన్స్ ని చేస్తూ ఉంటారు, లేటెస్ట్ గా కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) నుండి…

అఫీషియల్ గా అజిత్ కుమార్ ఫస్ట్ లుక్ ని పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో అజిత్ కుమార్ లుక్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది…దాంతో పాటు సాలిడ్ గా రీచ్ ను కూడా సొంతం చేసుకుంది. మొత్తం మీద అఫీషియల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన 24 గంటల్లో…

ట్విట్టర్ లో ఈ ఫస్ట్ లుక్ మీద ఏకంగా 41 మిలియన్స్ కి పైగా ఇంప్రెషన్స్ సొంతం అయ్యి రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రికార్డ్ ఫస్ట్ లుక్ ట్రెండ్స్ లో ముందు నిలిచింది అని అంటున్నారు, రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేసినప్పుడు కూడా 27.2 మిలియన్ ఇంప్రెషన్స్ సొంతం అయ్యాయని…

టైటిల్ రివీల్ విషయంలో ఇది రికార్డ్ అంటూ మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఫస్ట్ లుక్ పరంగా కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ దుమ్ము లేపిందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుండగా ఈ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొడతానని అజిత్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here