జాతిరత్నాలు… టాలీవుడ్ లో రూపొందిన చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలలో ఒకటిగా నిలిచే సినిమా, ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ను టాక్ కి అతీతంగా విరగబడి థియేటర్స్ కి రప్పించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో అత్యధిక లాభాలను సొంతం చేసుకున్న సినిమాలలో కూడా ఒకటిగా నిలిచిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
సినిమాను మొత్తం మీద కేవలం 4 కోట్ల లోపు బడ్జెట్ లో రూపొంచారు. ఇక సినిమా ఓవరాల్ గా నిర్మాతలకు అల్టిమేట్ ప్రాఫిట్స్ ను సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి. సినిమా బడ్జెట్ కి థియేట్రికల్ బిజినెస్ ద్వారానే 11 కోట్ల దాకా బిజినెస్ జరిగింది.
ఇక సినిమా ఓవరాల్ గా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా అద్బుతమైన రేటు ని సొంతం చేసుకుందని సమాచారం. డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమా కి ఏకంగా 12 కోట్ల దాకా రేటు సొంతం అయ్యిందని ట్రేడ్ లో టాక్ ఉండగా, మ్యూజిక్ రైట్స్ కింద మరో…
75 లక్షల దాకా బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఓవరాల్ గా 4 కోట్ల బడ్జెట్ కి నిర్మాతకి మొత్తం మీద 23.75 కోట్ల బిజినెస్ జరిగేలా చేయగా అందులో 4 కోట్లు పక్కకు పెడితే సినిమా ఓవరాల్ గా 19.75 కోట్ల లాభాన్ని సొంతం అయ్యేలా చేసింది, ఇంకా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ బిజినెస్ బాలెన్స్ ఉండగా అది కూడా సాలిడ్ గానే జరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11.5 కోట్ల టార్గెట్ కి 38.52 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 27 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమాతో అటు నిర్మాత ఇటు బయ్యర్లు థియేటర్స్ ఓనర్స్ విపరీతంగా లాభాలను సొంతం చేసుకున్నారు అని చెప్పొచ్చు.