Home న్యూస్ టోవినో థామస్ ARM మూవీ 4 డేస్ కలెక్షన్స్….బానే కుమ్మిందిగా!!

టోవినో థామస్ ARM మూవీ 4 డేస్ కలెక్షన్స్….బానే కుమ్మిందిగా!!

0

టాలీవుడ్ ఆడియన్స్ కి ఓటిటి హిట్ మిన్నల్ మురళి, థియేట్రికల్ డబ్ హిట్ 2018 లాంటి సినిమాలతో మన వాళ్ళకి సుపరిచితుడే అయిన టోవినో థామస్ కెరీర్ లో భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందిన లేటెస్ట్ మూవీ ARM సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాలో మలయాళ ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉండటంతో మన దగ్గర టాక్ మిక్సుడ్ గా ఉంది…

సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ అలాగే ఇక్కడ భారీ పోటి వలన కూడా పెద్దగా జోరు చూపించ లేక పోయింది. ఓవరాల్ గా సినిమా లాంగ్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 35 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోగా ఇక్కడ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే…

2 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా తేరుకునే అవకాశం కొంచం కష్టంగానే ఉంది, కానీ సినిమా కేరళలో మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా మలయాళ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది కాబట్టి…

ఈ సినిమా కూడా ఓవర్సీస్ లో కుమ్మేసింది. దాంతో లాంగ్ 4 డేస్ వీకెండ్ లో సినిమా మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ఓవరాల్ గా కేరళలో అలాగే ఓవర్సీస్ లో మంచి జోరుని చూపెడుతూ వీకెండ్ లో 30 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…

ఓవరాల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
ARM Movie 4 Days Total World Wide Collections Approx
👉Kerala – 13.50Cr~
👉Telugu States – 0.75Cr
👉ROI – 1.90Cr
👉Overseas – 15.60Cr***approx
Total WW collection – 31.75CR(14.50CR~ Share)

ఓవరాల్ గా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా లాంగ్ వీకెండ్ లో బాగానే జోరు చూపించింది. సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు క్లియర్ గా తెలియరాలేదు కానీ ట్రేడ్ లెక్కల్లో సినిమా మినిమమ్ 26-28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది అని అంచనా…ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here