బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా హిందీ లో మాత్రం ఎలాగోలా పర్వాలేదు అనిపిస్తున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలం అవుతూ వస్తుంది…
సంక్రాంతి సెలవులలో సినిమా మంచి జోరుని చూపెడుతుంది అనుకున్నా కూడా అలా ఏమి జరగడం లేదు ఇప్పుడు…. సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 122 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ కి అమ్మగా తొలిరోజు కలెక్షన్స్ నుండే అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమా రెండో రోజు నుండి కంప్లీట్ గా…
స్లో డౌన్ అయింది…ఇక మూడో రోజు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ మూవీ 4వ రోజున భోగి పండగ హాలిడే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పెద్దగా జోరు ని చూపించ లేక పోయింది…ఓవరాల్ గా 3.10 కోట్ల రేంజ్ లోనే షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుని మైండ్ బ్లాంక్ చేసింది…
ఇక టోటల్ గా 4 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Game Changer 4 Days AP-TG Collections Report(Inc GST)
👉Nizam: 16.53CR
👉Ceeded: 8.79CR
👉UA: 7.80CR
👉East: 6.06CR
👉West: 3.14CR
👉Guntur: 5.45CR
👉Krishna: 4.18CR
👉Nellore: 3.15CR
AP-TG Total:- 55.10CR(78.25CR~ Gross)
(45%~ Recovery)
ఇదీ ఓవరాల్ గా సినిమా 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క….సినిమా తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 124 కోట్ల దాకా ఉండగా 4 రోజుల్లో ఓవరాల్ గా 45% వరకు రికవరీని సొంతం చేసుకోగా మరో 69 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు రికవరీని అందుకోగలుగుతుందో చూడాలి…