బాక్స్ ఆఫీస్ దగ్గర విశాల్(Vishal) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony) మూవీ ఎట్టకేలకు 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో జోరు చూపించింది. వినాయక చవితి హాలిడే కలిసి రావడంతో తెలుగు లో సినిమా మంచి ట్రెండ్ ను చూపించి…
3వ రోజు తో పోల్చితే నాలుగో రోజు మంచి కలెక్షన్స్ ని చేసుకోవడం విశేషం. సినిమా 4వ రోజు ఆల్ మోస్ట్ 1.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు లో సొంతం చేసుకుంది. అందులో షేర్ ఆల్ మోస్ట్ 70 లక్షల దాకా సొంతం అయ్యింది ఇప్పుడు…
దాంతో సినిమా 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ 2.70 కోట్ల రేంజ్ లో ఉంది. సినిమా వాల్యూ బిజినెస్ 4 కోట్ల దాకా ఉంటుందని అంచనా… అంటే సినిమా 4.5 కోట్ల షేర్ ని అందుకోవాలి. ప్రస్తుతం సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.80 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Mark Antony 4 Days WW Collections Report
👉Tamilnadu – 32.40Cr
👉Telugu States- 5.20Cr
👉Ka+ROI – 4.85Cr
👉Overseas – 9.60CR~***
Total WW Collections – 52.05CR(25.50CR~ Share)
విశాల్ కెరీర్ లో ఇవి ఆల్ టైం బిగ్గెస్ట్ తమిళ్ వర్షన్ కలెక్షన్స్ అని చెప్పాలి. సినిమా తెలుగు లో 4వ రోజు కొంచం జోరు చూపించినా లాంగ్ రన్ ని ఇలానే సొంతం చేసుకుంటే బిజినెస్ ను అందుకునే అవకాశం ఉంటుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.