ప్రస్తుతం నడుస్తున్న అన్ సీజన్ ని పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండానే ఎదురుకుంటూ తొలి వీకెండ్ సాలిడ్ కలెక్షన్స్ ని సాధించాక కూడా స్లో డౌన్ అవ్వకుండా దూసుకు పోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో 5.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నాక 4 వ రోజు మహా శివరాత్రి హాలిడే అవ్వడం తో ఆ అడ్వాంటేజ్ ను బాగా నే వాడుకుని…
బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అంచనాలు మించే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని సత్తా చాటింది, సినిమా నాలుగో రోజు నైజాం లో 78 లక్షలు, సీడెడ్ లో 26 లక్షలు, ఇలా మిగిలిన ఏరియాల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని మొత్తం మీద 4 వ రోజున…
1.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అని ముందు అనుకున్నా ఇప్పుడు లెక్క పెరిగి సినిమా ఏకంగా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పొచ్చు. సినిమా నాలుగు రోజులుగా కేవలం.. మినిమమ్ డ్రాప్స్ తోనే కలెక్షన్స్ ని సాలిడ్ గా..
అందుకుంటూ దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా 4 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కి మరింత క్లోజ్ గా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద అన్ సీజన్ లో కళ్యాణ్ రామ్ పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్…
లేకుండా 118 లాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమా తో మంచి వసూళ్ళని అందుకుని 2019 ఇయర్ కి గాను టాలీవుడ్ తరుపున రెండో క్లీన్ హిట్ ని ఇచ్చాడు అని చెప్పొచ్చు. సినిమా అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.