మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ ని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కానీ సినిమా బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా వీకెండ్ తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో సినిమా….
3 వ రోజు ఆదివారంతో పోల్చితే ఇప్పుడు వర్కింగ్ డే కారణంగా సినిమా ఆల్ మోస్ట్ 50-60% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్దివరకు గ్రోత్ ని సొంతం చేసుకున్న నైజాం అండ్ సీడెడ్ ఏరియాల్లో డ్రాప్స్ కొంచం ఎక్కువగా ఉన్నాయి.
మొత్తం మీద 3 వ రోజు సినిమా 1.3 కోట్ల షేర్ ని అందుకుంటే ఇప్పుడు 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ షేర్ ని అందుకునేలా ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే సినిమా 60 లక్షలకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది కానీ సినిమా బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక 4రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.