బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో 2 పాన్ ఇండియా డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి. వాటిలో విక్రాంత్ రోణ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా మరో పాన్ ఇండియా మూవీ ది లెజెండ్ ఇక్కడ దిక్కు మొక్కు లేకుండా పోయింది. సినిమాను ఏకంగా 45 కోట్ల రేంజ్ లో భారీగా రూపొందించగా సినిమాను జనాలు చూస్తారు అనుకున్న ఇక్కడ బయ్యర్లు ఆల్ మోస్ట్ కోటి దాకా పెట్టి సినిమా…
తెలుగు డబ్బింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. దాంతో సినిమా 1.20 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను చూసిన ఆడియన్స్ ఇదేం సినిమా రా బాబు అని తలలు పట్టుకు కూర్చునేలా చేసింది సినిమా…
దాంతో మొదటి రోజు తర్వాత సినిమాకి అసలు షేర్స్ పెద్దగా రాలేదు. మొత్తం మీద నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సినిమాకు సొంతం అయ్యింది అని చెప్పాలి…
అందులో షేర్ ఆల్ మోస్ట్ 15 లక్షల దాకా ఉంటుంది… అంటే పెట్టిన పెట్టుబడిలో 20% కూడా సినిమా రికవరీ చేస్తుందో లేదో అన్న పరిస్థితి అని చెప్పాలి. అటు తమిళనాడులో కూడా సినిమా 5 రోజుల్లో 3.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందట…. ఈ లెక్కన సినిమా అక్కడ కూడా తీవ్రంగానే నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి.
మొత్తం మీద బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో సినిమా క్వాలిటీ పరంగా ఆకట్టుకున్నా కానీ కంటెంట్ పరంగా ఏమాత్రం ఇంప్రెస్ చేయక పోవడం, హీరోనే సినిమాకి మైనస్ అవ్వడంతో జనాలు ఏమాత్రం ఆసక్తిని చూపడం లేదు. దాంతో తమిళ్ తో పాటు అన్ని చోట్లా సినిమాకి గట్టి ఎదురుదెబ్బ తగినట్లు అయింది ఇప్పుడు…