Home న్యూస్ కన్నడ చరిత్ర చిరిగింది…60 కోట్లతో KGF ఊచకోత!

కన్నడ చరిత్ర చిరిగింది…60 కోట్లతో KGF ఊచకోత!

0

  కన్నడ సినీ హిస్టరీ లో మరే సినిమా సాధించని లెవల్ లో కలెక్షన్స్ ఊచకోత కోస్తూ లేటెస్ట్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ ను అన్ని చోట్లా అల్టిమేట్ వసూళ్ళతో ఏలేస్తుంది. సినిమా కర్ణాటక తో పాటు తెలుగు హిందీ లో కుమ్మేస్తుండగా తమిళ్ లో కూడా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకుంటూ మొదటి వీకెండ్ ని ఎవ్వరి అంచనాలను అందని విధంగా అల్టిమేట్ లెవల్ లో ముగించి సత్తా చూపింది.

కాగా మూడు రోజుల అఫీషియల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద వీకెండ్ ముగిసే సరికి టోటల్ గా 56 కోట్ల నుండి 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందని సమాచారం. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి.

కర్ణాటక మూవీస్ చాలా వరకు లైఫ్ టైం లో అందుకునే కలెక్షన్స్ ని ఈ సినిమా కేవలం వీకెండ్ లోనే అందుకుని అక్కడ ఫాస్టెస్ట్ 50 కోట్లు మరియు 60 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకున్న సినిమా గా నిలిచి సరికొత్త చరిత్ర ను నెలకొల్పింది. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here