బాక్ టు బాక్ బాక్స్ అఫీస్ దగ్గర రెండు ఎపిక్ డిసాస్టర్స్ ను సొంతం చేసుకుని కెరీర్ లో ఒక్కసారిగా పూర్తిగా స్లో డౌన్ అయిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని ఇప్పుడు అన్ సీజన్ లో కెరీర్ బెస్ట్ రికార్డులతో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
ఈ క్రమంలో ఆల్ రెడీ నాగ చైతన్య కెరీర్ లో మొట్ట మొదటి 45 కోట్ల షేర్ మార్క్ మూవీగా నిలిచిన సినిమా ఇప్పుడు 12వ రోజు సాధించిన కలెక్షన్స్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజులు పూర్తి అయ్యే టైంకి..
సినిమా వరల్డ్ వైడ్ గా 49.41 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపగా 12వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా ఆల్ మోస్ట్ మమ్మోత్ 50 కోట్ల షేర్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలకు…
బిగ్ బెంచ్ మార్క్ గా ఉండే 50 కోట్ల షేర్ మార్క్ ని ఎట్టకేలకు ఇప్పుడు నాగ చైతన్య తండేల్ మూవీతో సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. అది కూడా రెండు బాక్ టు బాక్ డిసాస్టర్స్ ని సొంతం చేసుకున్న తర్వాత చేసిన సినిమా తో… అన్ సీజన్ లో ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లాంటివి లేకుండా…
నార్మల్ రిలీజ్ తో ఈ ఫీట్ ని 12 రోజుల్లో అందుకుని దుమ్ము లేపగా…ఇందులో నాన్ స్టాప్ గా 10 రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని కూడా అందుకోవడం మరో మాస్ రచ్చ అని చెప్పాలి. ఇక తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేస్తుందో చూడాలి.