బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అయిన యాత్ర2(Yatra2 Movie) మొదటి పార్ట్ యాత్ర(Yatra)రేంజ్ లో రచ్చ చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ సినిమా ఓపెనింగ్ డే నుండే కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది. సినిమా మొత్తం మీద ట్రేడ్ లెక్కల్లో 50 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో…
తెరకెక్కగా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి ఆల్ మోస్ట్ 20 కోట్లకు పైగా రికవరీ అయ్యింది అన్న టాక్ ఉండగా మిగిలిన మొత్తం థియేటర్స్ నుండి రాబట్టాల్సిన అవసరం నెలకొనగా సినిమా మొదటి రోజే కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు, రెండో రోజు భారీగా డ్రాప్ అయిన సినిమా ఇప్పుడు…
Yatra2 Movie Budget, Business and Loss Report Estimations
వీకెండ్ లో పెద్దగా హోల్డ్ ని ఏమి చూపించ లేక పోతుంది, ఇక వర్కింగ్ డేస్ లో కూడా సినిమా భారీగా స్లో డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో సినిమా 5 కోట్లు థియేటర్స్ నుండి అందుకున్నా అద్బుతమే అని చెప్పాలి ప్రస్తుతం సినిమా పరిస్థితిని చూస్తూ ఉంటే…
ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ రిటర్న్స్ కలిపినా కూడా ఓవరాల్ గా బడ్జెట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 50 కోట్ల రేంజ్ మూవీ అనుకున్నా కూడా సగం వరకే రికవరీ అయ్యే అవకాశం ఉండగా మిగిలిన మొత్తం నష్టమే అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరి సినిమా థియేటర్స్ లో అంచనాలను మించి ఏమైనా కలెక్షన్స్ ని సాధించగలుతుందో లేదో చూడాలి, మలయాళ వర్షన్ ని అయినా రిలీజ్ చేసి ఉంటే అక్కడ మమ్ముట్టి(Mammootty) పేరు మీద ఎంతో కొంత రికవరీ అయ్యేది కానీ సినిమా కేవలం తెలుగులోనే రిలీజ్ అవ్వడంతో ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.